తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (09:35 IST)
తెలంగాణాలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురింసింది. ఇక రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీచేసింది. 
 
కాగా, గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీమ్, అసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. 
 
శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, జనగాం, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments