Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (09:18 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖాండ్వా జిల్లా పరిధిలోని కొండావత్ గ్రామంలో బావిని శుభ్రం చేసే క్రమంలో అందులో విష వాయువులను పీల్చి ఎనిమిది మంది మృతి చెందారు. 
 
గంగౌర్ పండుగ వేడుకల్లో భాగంగా, విగ్రహ నిమజ్జనం కోసం గ్రామస్తులు గురువారం బావిని సిద్ధం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. బావిలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి ఐదుగురు గ్రామస్తులు మొదట 150 యేళ్ళ పురాతనమైన బావిలోకి దిగారు. 
 
అయితే, వారు, అందులోని విష వాయువుల కారణంగా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత బురదలో మునిగిపోవడం ప్రారంభించారు. దాంతో వారిని కాపాడేందుకు మరో ముగ్గురు గ్రామస్తులు సహాయం కోసం బావిలోకి దిగారు. కానీ, విష వాయువుల ప్రభావంతో వారు కూడా అందులోనే చిక్కుకునిపోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు బావి వద్దకు చేరుకున్నాయి. నాలుగు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి, ఎనిమిది మృతదేహాలను ఒక్కొక్కటిగా బావి నుంచి వెలికి తీశారు. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తి చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. 
 
ఇక ఈ తీవ్ర విషాదం నేపథ్యంలో గ్రామస్తులు భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి బావిని మూసివేయాలని నిర్ణయించారు. బావిలోని విషపూరిత వాయువులు, ఊపిరాడక నీటిలో మునిగిపోవడానికి దారితీశాయని ప్రాథమిక తేలినందున, జిల్లా యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments