Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషాదంగా ముగిసిన సాఫ్ట్‌వేర్ దంపతుల విహార యాత్ర : పారాగ్లైడింగ్ చేస్తూ...

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (10:17 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. భర్త కళ్లముందే పారా గ్లైడింగ్ చేస్తున్న భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం శిల్ప బృందావనం కాలనీకి చెందిన సాయి మోహన్, నవ్య(26) అనే దంపతులు చండీగఢ్‌‌లో సాఫ్ట్‌వేర్ దంపతులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి ఒక యేడాది క్రితం వివాహమైంది. 
 
విహారయాత్రకై శనివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా కొద్దిసేపటికే హుక్ ఊడిపోయి ఓ ఇంటి పైకప్పుపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పారాగ్లైడింగ్ చేయించిన పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
ఈ ఘటన మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అధికారులు బాధిత కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. పైలట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. పారాగ్లైడింగ్ చేస్తున్నామని వీడియోకాల్ మాట్లాడిన కాసేపటికే ప్రమాదం జరిగిందని చెబుతూ సాయిమోహన్ తండ్రి తిరుమలరావు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కులూలో శవపరీక్షల అనంతరం అధికారులు సోమవారం రాత్రి మృతదేహాన్ని విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చి స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments