Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి ముత్తులో తల్లి... కన్నబిడ్డను కర్కశంగా కడతేర్చింది...

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (09:56 IST)
ప్రియుడి మత్తులో మునిగిపోయిన ఓ కసాయి తల్లి.. కన్నబిడ్డను కర్కశంగా కడతేర్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముళ్లపొదల్లే పడేసి దహనం చేసింది. ఈ అమానవీయ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా తాండికొండ మండలం బండారుపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆళ్లూరు మండలానికి చెందిన కౌతాళం సిద్ధార్థ అనే వ్యక్తి హైదరాబాద్ నగరంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు హైదరాబాద్ లాలాగూడకు చెందిన జంగంపల్లి స్వప్న అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. స్వప్నకు అప్పటికే మొదటి భర్తకు పుట్టిన నేహ(6) అనే కుమార్తె ఉంది. కొన్నాళ్ల క్రితం సిద్ధార్థ, స్వప్న పాపను తీసుకొని ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయంపై లాలాగూడ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
స్వప్న, సిద్ధార్ధలు ఊరూరూ తిరుగుతూ 25 రోజులు క్రితం తాడికొండ మండలం బండారుపల్లికి వచ్చారు. అక్కడ గుడారం ఏర్పాటు చేసుకొని నివసిస్తూ స్థానికంగా మిర్చి పనులకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారి మధ్య పాప అడ్డుగా ఉందని భావించి వారం క్రితం చిన్నారి తలపై రాయితో బలంగా కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బండారుపల్లి శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ముళ్ల కంచెలో పడేసి దహనం చేశారు. మంగళవారం గ్రామస్ధులు తాడికొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్వప్న కోసం గాలిస్తున్న లాలాగూడా పోలీసులు సైతం ఆమె బండారుపల్లిలో ఉందని తెలిసి మంగళవారమే ఇక్కడకు వచ్చారు. దీంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments