Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్... మేడిగడ్డకు ఎందుకుపోయారు…? ఏముంది అక్కడ బొందల గడ్డనా…!? అంటుండ్రు : సీఎం రేవంత్

revanth and ministers

ఠాగూర్

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (20:22 IST)
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు ఎందుకుపోయారు…? ఏముంది అక్కడ బొందల గడ్డనా…!? అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.. నిజమే… కేసీఆర్ ధనదాహంతో లక్ష కోట్ల రూపాయలు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవ్వాళ బొందలగడ్డగా మారిందని మండిపడ్డారు. 
 
తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణను పచ్చగా చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి, కాంగ్రెస్ ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత - చేవేళ్ల డిజైన్లు మార్చి… కాళేశ్వరం పేరుతో కమీషన్లు బొక్కి కేసీఆర్ సృష్టించిన విధ్వంసం ఈ రోజు మేడిగడ్డ రూపంలో కళ్లముందు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు… తెలంగాణ ప్రజల నమ్మకం. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు నాలుగు కోట్ల ప్రజల ఆశలు, ఈ నేరానికి శిక్ష తప్పదు. ఈ ఘోరం కళ్లారా చూసి… తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నమే… సహచర మంత్రులు, శాసనసభ్యులతో కలిసి ఇవ్వాల్టి మేడిగడ్డ పర్యటన అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిషి శేఖర్ శుక్లా 100 పర్సంటైల్ సాధించాడు: ఆకాష్ బైజుస్ జాతీయ టాప్ స్కోరర్