Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి.. ముదిరిపోవడంతో యువతి ఆత్మహత్య

Advertiesment
suicide
, ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (11:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకతోనే వచ్చిన థైరాయిడ్ వ్యాధి వచ్చింది. ఇది ముదిరిపోవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. ఆ మరుసటి కాన్పులో ముగ్గురు కవలలు పుట్టారు. వీరిని దివ్య (21)కు పుట్టుకతోనే థైరాయిడ్ వ్యాధి ఉంది. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతుంది. ఇటీవలి కాలంలో వ్యాధి ముదరడంతో దివ్య మానసికంగా కుంగిపోయింది. 
 
ఈ క్రమంలో ఆమె శనివారం ఉదయం ఇంటి వెనుక చెట్టుకు ఉరేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తింటివారు వేధిస్తున్నారు.. గృహ హింస చట్టంలో మార్పులు చేయాలి..