Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో డిపోలో అగ్నిప్రమాదం - డంపింగ్ యార్డులో మంటలు చెలరేగి...

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (13:52 IST)
హైదరాబాద్ సిటీ మియాపూర్‌లో మెట్రో రైల్ డిపోలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. డిపోలోని చెత్త డంపింగ్ యార్డు ఏరియాలో ఈ మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అప్రమత్తమైన మెట్రో రైల్ సిబ్బంది అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం చేరవేయగా, హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మెట్రో అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఉద్యోగం మారారా? పీఎఫ్ సొమ్ముపై టెన్షన్ పడుతున్నారా? ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్ అమలు!! 
 
చాలా మంది ఉద్యోగులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారుతుంటారు. ఇలాంటి వారు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బుల గురించి ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారికి ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పింది. ఉద్యోగం మారినా పీఎఫ్ గురించి టెన్షన్ అక్కర్లేదని తెలిపింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం... ఒక ఉద్యోగి ఒక కంపెనీకి రాజీనామా చేసి మరో కంపెనీ ఉద్యోగంలో చేరినా అతని పీఎఫ్ సొమ్ము ఆటోమేటిక్‌ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. పాత ఖాతాలోని సొమ్ము మొత్తం కొత్త ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే పనిలేకుండా మార్పులు ప్రభుత్వం చేసింది. 
 
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్‌గా విలీనం అవుతాయి. పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి. దీంతో పీఎఫ్ ఖాతాలో సీనియారిటీ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉద్యోగికి ఉండదు. సాధారణంగా పీఎఫ్ ఖాతాలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నపుడు కొంత మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల సర్వీసు దాటిన ఖాతాల నుంచి సొమ్ము తీసుకున్నపుడు అయితే ఈ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా అమల్లోకి వచ్చిన రూల్‌తో ఉద్యోగం మారినా పీఎఫ్ ఖాతా సీనియారిటీ విషయంలో మార్పుండదు. కాబట్టి ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments