Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలకు 50 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (13:00 IST)
ప్రభుత్వ పాఠశాలలకు 50 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 13 తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. దీనికితోడు వేసవి ఎండల తీవ్ర క్రమంగా పెరుగుతుంది. రానున్న రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా, ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్‌‍సభలకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 
 
ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 50 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. ఎండల కారణంగా మార్చి 18వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ పాఠశాలలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

గతంలో ఓ అమ్మాయిని ప్రేమించా... అది వర్కౌట్ కాలేదు : విజయ్ దేవరకొండ
 
తాను గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని కానీ అది వర్కౌట్ కాలేదని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తాను నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చా..? అనే ప్రశ్న విజయ్ దేవరకొండకు ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆయన చాలా తెలివిగా, చాకచక్యంగా సమాధానమిచ్చారు. 
 
'ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఉదాహరణకు నా స్నేహితులు చాలామంది రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బంధం ముందుకు సాగలేదు. దానివల్ల కొన్నేళ్లపాటు బాధ అనుభవించారు. ఆ తర్వాత మరొకరిని కలిశారు. ప్రేమలో పడ్డారు. కాబట్టి, వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని  ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్‌ కాలేదు' అని చెప్పారు.
 
కొత్త దర్శకులతో కలిసి వర్క్‌ చేస్తారా..? అని ప్రశ్నించగా.. 'కొత్త దర్శకులతో వర్క్‌ చేయాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే, అనుభవం లేకుండా బడ్జెట్‌, మేకింగ్‌ను మేనేజ్‌ చేయడం క్లిష్టమవుతుంది. ఒక్క సినిమా అయినా చేసిన దర్శకుడితో వర్క్ చేస్తా. సినిమా మేకింగ్‌పై అవగాహన ఉంటుంది. అతడి గత చిత్రం హిట్‌, ఫ్లాప్‌ అనేది చూడను' అని బదులిచ్చారు. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకెంతో ఇష్టమన్నారు. 'డాడీ'లో బన్నీ డ్యాన్స్‌ చూసి అబ్బురపడినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments