Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టాన్‌ఫోర్డు వర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లకు కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో!!

hyderabad metro

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (07:38 IST)
ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నారు. విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఈ ప్రాజెక్టును ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు. ఐఎస్‌బీ ప్రొఫెసర్ల చేసిన అధ్యయనాన్ని స్టాన్‌ఫోర్డ్ యూనవర్శిటీ ప్రచురించింది. ప్రాజెక్టు విజయంలో హైదరాబాద్ మెట్రో రైల్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి బృందం కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ ప్రాజెక్టును ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ విద్యార్థులు, ప్రొఫెసర్లకు కేస్ స్టడీగా చేర్చారు. సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ తాజా సంచికలో దీన్ని ప్రచురించారు. 
 
ఇది ఓ భారతీయ సంస్థకు దక్కిన అరుదైన గౌరవమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు, పరిష్కార మార్గాలను ఈ జర్నల్‌లో ప్రచురిస్తుంటారు. ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్లు రాయ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు జరిపిన అధ్యయనాన్ని విశ్వవిద్యాలయం వారు కేస్ స్టడీగా ప్రచురించారు. ప్రాజెక్టు విజయంవంతం చేయడంలో హెచ్ఎంఆర్ఎల్ఏ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ లక్షణలతో పాటు ప్రతిభను కనబరిచిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 
 
మే 5న నీట్ యూజీ పరీక్ష - నీట్ దరఖాస్తుల గడువు పొడగింపు 
 
ఈ యేడాది మే 5వ తేదీన నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడగించింది. నిజానికి ఈ పరీక్షా తేదీ ఈ నెల 9వ తేదీతో ముగిసింది. ఇపుడు ఈ తేదీని ఈ నెల 16వ తేదీ వరకు పొడగించింది. ఈ నీట్ ప్రవేశ పరీక్షను రాసేందుకు భారీ ఎత్తున దరఖాస్తులు వస్తుండటంతో ఈ గడువు తేదీని పొడగించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే వైద్య విద్యా కోర్సులకు నిర్వహించే ఈ నీట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 16వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు తెలిపింది. దరఖాస్తులు భారీగా వస్తున్నందన ఈ గడువు పొడగిస్తున్నట్టు ఎన్.టి.ఏ తెలిపింది. 
 
దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షలు ఎన్.టి.ఏ ఈ యేడాది మే నెల 5వ తేదీన నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించేలా ఏర్పాట్లు చేయనుంది. నీటి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు exams.nta.ac.in అనే వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్.టి.ఏ సూచించింది. వాస్తవానికి ముందు షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం నీట్ యూజీ పరీక్ష దరఖాస్తు ఈ నెల 9వ తేదీతోనే ముగిసిపోయింది. అయితే, దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఈ చివరి తేదీని ఈ నెల 16వ తేదీ రాత్రి 10.50 నిమిషాల వరకు పొడగించినట్టు ఎన్.టి.ఏ. పేర్కొంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 5న నీట్ యూజీ పరీక్ష - నీట్ దరఖాస్తుల గడువు పొడగింపు