Webdunia - Bharat's app for daily news and videos

Install App

Engineering student: ర్యాగింగ్ భూతం.. ఫ్యానుకు ఉరేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి (video)

సెల్వి
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (10:53 IST)
Student
కాలేజీల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కఠిన చట్టాలు వున్నప్పటికీ.. మళ్లీ మళ్లీ ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. యువ ఇంజినీరింగ్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ర్యాగింగ్‌ కారణంగా సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక జాదవ్ సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి తేజను సీనియర్లు, స్థానిక యువకులతో కలిసి కొట్టి, బార్‌కు తీసుకెళ్లి రూ.15 వేల బిల్లు చెల్లించాలని వేధించారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి తేజ తన తండ్రికి వీడియో పంపి హాస్టల్‌లో ఉరివేసుకున్నాడు. ఉరేసుకునేందుకు ముందు తాను బలవన్మరణానికి పాల్పడేందుకు ర్యాగింగ్ కారణమని పేర్కొన్నట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చరీకి తరలించారు. ర్యాగింగ్ కారణమా లేక వేరే కారణాలా అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

పీఎంవో నుంచి కాల్ వస్తే కల అనుకున్నా : మోహన్ లాల్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments