Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీధికుక్కల దాడి.. ఇంటి పైకప్పుపైకి ఎక్కిన ఎద్దు.. స్థానికులు షాక్.. ఎక్కడ? (video)

Advertiesment
Bull House roof

సెల్వి

, సోమవారం, 15 సెప్టెంబరు 2025 (12:04 IST)
Bull House roof
మొన్నటికి మొన్న ఇంటి ప్రహరీ గోడపైకి కారు ఎక్కిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పుపైకెక్కింది. ఈ వింత ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఎద్దు ఎందుకు ఇంటి పైకప్పుకు ఎక్కిందనే విషయాన్ని ఆరా తీస్తే.. ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కల బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆ ఎద్దు ఇంటి పైకి ఎక్కిందని స్థానికులు అంటున్నారు. 
 
ఈ సంఘటన ఆదిలాబాద్, భోరజ్ మండల పరిధిలోని నిరాల గ్రామంలో జరిగింది. నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట గూటానికి కట్టేశాడు. ఆదివారం ఉదయం కొన్ని కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో ప్రాణభయంతో కట్టుతాళ్లను తెంచుకుని పక్కనే ఉన్న రాళ్ల కట్టపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరింది. 
 
ఇంటిపై ఎద్దు ఉండటాన్ని చూసి గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆపై చాలాసేపు శ్రమించి, తాళ్ల సాయంతో ఎద్దును జాగ్రత్తగా కిందికి దించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ అనే వ్యక్తి ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనీట్రాప్‌లో యోగా గురువు.. ఆ ఫోటోలు లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్.. చివరికి?