బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాక్ ఇచ్చారు. కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ పేర్కొన్నారు. కవిత చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే.. మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. దానితో పాటు బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను బీఆర్ఎస్ తొలగించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో నుంచి వినిపిస్తున్నాయి.
మాజీ సీఎం కేసీఆర్‌పై కొందరు అగ్రనేతలు కుట్రలు చేస్తున్నారని.. వారి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి హరీష్ రావు వల్లే జరిగిందని, అందుకే రెండో సారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి హరీష్ రావును తప్పించారని కవిత విమర్శలు గుప్పించారు.