Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో కార్మికుల పొట్టకొట్టింది.. ఆటో డ్రైవర్లు

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (12:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నిక హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం తమ పొట్టికొట్టిందంటూ తెలంగాణాలోని అనేక ఆటోల సంఘాల ఆందోళన చేస్తున్నారు. మూడు రంగాల జెండా మూడు చక్రాల ఆటో డ్రైవర్ల పొట్టి కొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన పథకం ఆటో కార్మికులకు నష్టం చేసిందన్నారు. వివిధ జిల్లాల్లో ఆందోళన చేసిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట, మెదక్, జగిత్యాల తదితర జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమకు ఉపాధి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 
 
అధ్యక్షుడు సాయిరామ్ మాట్లాడుతూ... తాము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆటోలను నడిపిస్తున్నామని, ఇప్పుడు ఈ పథకం వల్ల పూట గడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు ఆటో ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. మూడు రంగుల జెండా మూడు చక్రాల ఆటో జీవితాల్లో చీకటిని నింపిందన్నారు. లక్షలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. 
 
కార్మికుల ఆటో కార్మికుల జీవితం కోసం ఈ పథకంపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల భృతిని అందించాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments