Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆటో డ్రైవర్ల ఆందోళన

Advertiesment
ts auto
, గురువారం, 14 డిశెంబరు 2023 (17:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామంటూ పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ పథకం వల్ల తమ కుటుంబ సభ్యులు రోడ్డు పడుతున్నామని, అందువల్ల తమకు నెలకు రూ.20 వేల వేల జీవన భృతి ఇవ్వాలని, పింఛన్లు ఇచ్చి తమన ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
జిగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన నవ తెలంగాణ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, నిరసన ర్యాలీలో పాల్గొని, ఆ తర్వాత ఆందోళనకు దిగారు. అలాగే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోనూ ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. 
 
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో సాటాపూర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కామారెడ్డిలో జిల్లాలోనూ ఆటో డ్రైవర్ల ఆందోళన జరిగింది. నిర్మల్ జిల్లా ముథోల్‌లోని బాసర - భైంసా రహదారిపై ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మిరుదొడ్డి, సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల, నల్గొండ జిల్లా దేవరకొండల్లోనూ ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. 

ఏపీలో ఇంటర్ - పదో తరగతి పరీక్షల టైం టేబుల్ వెల్లడి 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల టైంటేబుల్‌ను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే, పదో తరగతి పరీక్షలను మార్చి 18వ తేదీ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు నిర్వహిస్తారు. 
 
ఈ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల ఈ లోపు రాష్ట్రంలో 10, 12వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పరీక్షలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులంతా కష్టపడి చదివి, విద్యార్థులంతా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇంటర్ - పదో తరగతి పరీక్షల టైం టేబుల్ వెల్లడి