భారాస ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేదే లేదు, మనం చెప్పేది వినాల్సిందే, అదే శిక్ష: సీఎం రేవంత్
, శనివారం, 16 డిశెంబరు 2023 (22:51 IST)
లేదు లేదు మనం అట్లేంలేదు. వాళ్లు వినాల్సిందే. వాళ్లకిదే శిక్ష. వాళ్లను ఎవర్నీ బయటకు పంపను. వాళ్లను ఎవర్నీ బయటకి పంపించవద్దు అధ్యక్షా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్లను ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలను వాళ్లు వినడం ద్వారా వాళ్లలో పరివర్తన తేవాలన్నదే ప్రభుత్వం ఆలోచన.
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 ఇస్తాము. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాము. ఇంకా ఎన్నో చేయాల్సినవి వున్నాయి.