Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రోలో చీర చిక్కుకుని మహిళ మృతి.. ఎలా?

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (11:03 IST)
ఢిల్లీ మెట్రో రైల్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. మెట్రోలో చీర చిక్కుకోవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మెట్రో రైల్ తలపుల మధ్య చీర చిక్కుకుపోవడంతో రైలు కింద పడి తీవ్ర గాయాలై చనిపోయింది. ఈ నెల 14వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆమె రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
మృతురాలి బంధువు తెలిపిన వివరాల ప్రకారం, నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇందర్క్ స్టేషన్‌లో బాధితురాలు రైలు మారే క్రమంలో డోర్ తలుపుల్లో ఆమె చీర చిక్కుకుపోయింది. దీంతో, రైలు కిందపడిన ఆమె తీవ్ర గాయాలపాలవగా వెంటనే సఫ్టర్ంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితురాలు శనివారం సాయంత్రం మృతి చెందింది.
 
మహిళకు కొడుకు, కూతురు ఉన్నారని, భర్త ఏడేళ్ల క్రితం చనిపోయారని ఆమె బంధువు తెలిపింది. కాగా, ఘటనపై విచారణ చేపడతామని మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ పేర్కొన్నారు. అయితే, ఈ ఉదంతంలో ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 
 
కదలుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. రాజస్థాన్‌లో దారుణం 
 
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. క్యాబిన్‌లో కూర్చొన్న బాలికపై వంతుల వారీగా ఇద్దరు డ్రైవర్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. బస్సులోని ప్రయాణికులు అనుమానంతో క్యాబిన్ డోర్ తీయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ తర్వాత డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదాడు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఫూల్ చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు డిసెంబర్ 9న రాత్రి 7:30 గంటల సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్‌లోనే కూర్చొని ప్రయాణించింది. క్యాబిన్‌లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్ చంద్ మీనా వివరించారు.
 
ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు క్యాబిన్ డోర్ తెరవడంతో ఈ అఘాయిత్యం బయటపడింది. బాలిక దీన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారని మీనా వెల్లడించారు. అయితే ఒక డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నారని చెప్పారు. ప్రయాణికులు బస్సును ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి ఆపారని, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. 
 
బాలిక మామయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారని ఫూల్ చంద్ మీనా పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న బాలిక మావయ్య అత్యాచారంపై ఫిర్యాదు చేశాడని వివరించారు. కాగా నిందిత బస్సు డ్రైవర్లలో మహ్మద్ ఆరిఫ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో నిందితుడిని లలిత్ గుర్తించామని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటన 2012లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను గుర్తుకు తెచ్చింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరగగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం