Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కేసీఆర్ అండ్ కో జాగిరికాదు... : రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (09:04 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణ కేసీఆర్ అండ్ జాగిరి కాదన్నారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలని తెలంగాణ యువతకు ఆయన పిలుపునిచ్చారు. 
 
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ, తెరాస అభ్యర్థి చెన్నమనేని రమేష్‌ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారని ఆయన విమర్శించారు. 
 
తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే గతంలో చెప్పారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఏం న్యాయం చేశారని నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున పింఛను ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments