Webdunia - Bharat's app for daily news and videos

Install App

"థాయ్ కేవ్" అనుభవం అదో భయానకం.. వర్షపు నీటితో...

థాయ్‌లాండ్‌లోని థాయ్ లువాంగ్ గుహ నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది చిన్నారులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత వారు మీడియా ముందుకు వచ్చారు.

Webdunia
గురువారం, 19 జులై 2018 (10:34 IST)
థాయ్‌లాండ్‌లోని థాయ్ లువాంగ్ గుహ నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది చిన్నారులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత వారు మీడియా ముందుకు వచ్చారు.
 
* తమకు ఇది పునర్జన్మ అని చెప్పారు. గుహ నుంచి క్షేమంగా బయటకు రావడం నిజంగా ఓ అద్భుతమన్నారు. 
* ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేసిన తర్వాత గుహ చూసి వద్దామని వెళ్లాం. అక్కడ వర్షపు నీరు ఎక్కువగా రావడం వల్ల బయటకు రాలేక పోయినట్టు చెప్పారు. 
* గుహ నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గాన్ని తవ్వేందుకు ప్రయత్నించాం. కానీ అది సాధ్యపడలేదు. 
* పైగా, తమను కాపాడేందుకు ఎవరైనా తప్పకుండా వస్తారనే నమ్మకంతోనే ఉన్నట్టు చెప్పారు. 
* గుహ రాళ్ల నుంచి కారుతున్న వర్షపు నీరును తాగి తొమ్మిది రోజులు ప్రాణాలు కాపాడుకున్నట్టు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. 
 
* గుహ చూసేందుకు వెళుతున్నామని తమ ఇళ్లలో చెప్పలేదు. ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ అని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. 
* తమను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన డైవర్లకు చిన్నారులు కృతజ్ఞతలు చెప్పారు.  
* కాగా, రెండు వారాలకుపైగా గుహలో ఉండటంతో ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారిని చియాంగ్‌రాయ్‌లోని ఓ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments