Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెండితెరపై "థాయ్ కేవ్ రెస్క్యూ" - రూ.400 కోట్ల బడ్జెట్‌తో

దట్టమైన అడవిలో ఉన్న ఓ గుహలో చుట్టూ నీరు, చిమ్మ చీకటి, గుహలో ఇరుక్కునే వారిని రక్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు, సన్నని ఇరుకు మార్గం కారణంగా జాప్యమైన రెస్క్యూ ఆపరేషన్, కానీ ఆత్మస్థైర్యమే ఆయుధంగా 90 మంది డ

Advertiesment
Thai Cave Rescue
, శుక్రవారం, 13 జులై 2018 (11:07 IST)
దట్టమైన అడవిలో ఉన్న ఓ గుహలో చుట్టూ నీరు, చిమ్మ చీకటి, గుహలో ఇరుక్కునే వారిని రక్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు, సన్నని ఇరుకు మార్గం కారణంగా జాప్యమైన రెస్క్యూ ఆపరేషన్, కానీ ఆత్మస్థైర్యమే ఆయుధంగా 90 మంది డైవర్స్ ప్రాణాలకి తెగించి 13 మందిని కాపాడటం. ఇదంతా హాలీవుడ్ సినిమాని తలపించే నాటకీయ పరిణామాలతో ఉంది. పైగా, ఓ హాలీవుడ్ సినిమాని తీయాలంటే ఇంత కన్నా ఏం కావాలి అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫ్యూర్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ ఈ ఉదంతంపై సినిమా తీయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం రూ.400 కోట్ల బడ్జెట్‌ను వ్యయం చేయనున్నారు.
 
ఇటీవల విహారయాత్రకని వెళ్లి గుహలో మూడు వారాలుగా బిక్కుబిక్కు మంటూ గడిపిన 13 మందిని, 90 మంది డైవర్లు ప్రాణాలకి తెగించి కాపాడిన సంగతి తెలిసిందే. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఒక డైవర్ కన్నుమూశారు. ఈ ఆపరేషన్ లో 13 మందిని వ్యయప్రయాసలు కూర్చి కాపాడిన ఉదంతం ఇప్పుడు వెండితెరపై దృశ్యకావ్యంగారానుంది. ఈ చిత్రాన్ని ఫ్యూర్ ఫ్లిక్స్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుంది. కావోస్ ఎంటర్టైన్‌మెంట్‌కు చెందిన ఆడమ్ స్మిత్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ప్యూర్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్‌మెంట్ సీఈఓ మైఖేల్ స్కాట్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తెరకెక్కిస్తానని చెప్పారు. ఆ వాస్తవ కథ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
 
కాగా, గత నెల 23న థాయ్‌లాండ్‌లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, ఓ ఫుట్ బాల్ కోచ్ తిండి తిప్పలు లేకుండా మూడు వారాలు కాలం గడిపారు. కేవలం తమ గురువు ఇచ్చిన మానసిక స్థైర్యంతోనే బాలురు ధైర్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. భారీ వరదల వలన గుహలోనికి నీరు చేరడంతో, గుహ ముఖద్వారానికి 4 కిలోమీటర్ల దూరంలో వారు చిక్కుకున్నారు. డైవర్స్ తమ ప్రాణాలనిఫణంగా పెట్టి వారిని సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ అంతా నాటకీయ పరిణామాలతో చాలా థ్రిల్లింగ్‌గా సాగిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సీక్రెట్ నాకు తెలియదు.. లేదంటే నా జుట్టు... రజినీకాంత్