ఇన్నాళ్లకు నా కల నెరవేరింది... మా అమ్మానాన్న తొలిసారి విమానం ఎక్కారు..?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (13:28 IST)
NeerajChopra
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా కల నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్ 2020కి తర్వాత స్వదేశం చేరిన తర్వాత వరుసగా సభలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేశాడు. ఎట్టకేలకు కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.
 
నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ ఓ సాధారణ రైతు. తల్లి సరోజ్ దేవి, గృహిణి. వీరికి నీరజ్ చోప్రాతో పాటు  ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. సతీశ్ కుమార్‌కి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబపోషణ, ఆర్థిక సమస్యల కారణంగా, అది కలగానే మిగిలిపోయింది. 
 
నీరజ్ చోప్రా, తన తండ్రి కోరికను నిజం చేశాడు. తల్లిదండ్రులతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నీరజ్ చోప్రా... ‘నా చిన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. మా అమ్మానాన్న మొదటిసారి విమానం ఎక్కారు...’ అంటూ మురిసిపోతూ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments