Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ఘన్ ఎయిర్‌లైన్స్ సేవలు పునరుద్ధరణ

Advertiesment
ఆప్ఘన్ ఎయిర్‌లైన్స్ సేవలు పునరుద్ధరణ
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:17 IST)
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశంలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్ధరించారు. ఆప్ఘన్ ఎయిర్‌లైన్స్ సేవలు ఆగస్టు 31వ తేదీన యుఎస్ దళాలను ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారిగా దేశీయ విమానాలు తిరిగి ప్రారంభించింది. 
 
అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ కాబూల్ నుండి హెరాట్, మజార్-ఇ-షరీఫ్ మరియు కాందహార్ నగరాలకు తన విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది, జిన్హువా న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.
 
మీడియా సంస్థల సమాచారం ప్రకారం, కాబూల్ విమానాశ్రయంలో విమానాలను తిరిగి ప్రారంభించడానికి సహాయం చేయడానికి ఖతార్ నుండి ఒక సాంకేతిక బృందం అక్కడికి చేరుకుంది. ఈ బృందం సహాయంతో విమాన సర్వీసులను ప్రారంభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు : మరో నలుగురు అనుమానితుల వద్ద విచారణ