Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్‌ ట్రోఫీ : సర్దార్‌ సింగ్‌కు పిలుపు

ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం గురువారం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌‌కు తిరిగి చోటు కల్పించారు. మిడ్‌ ఫీల్డ్‌ను బలోపేత

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (07:37 IST)
ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో చాంపియన్స్‌ హాకీ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం గురువారం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌‌కు తిరిగి చోటు కల్పించారు. మిడ్‌ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్రాలను ఎంపిక చేశారు.
 
మొత్తం 18 మంది సభ్యుల జట్టుకు గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ యేడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. 
 
ముఖ్యంగా, కామన్వెల్త్‌ జట్టులో చోటుదక్కని సర్దార్‌ సింగ్, లక్రాలను తిరిగి ఎంపిక చేయడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో భాగంగా, ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది. 
 
జట్టు వివరాలు :
గోల్‌కీపర్స్‌: శ్రీజేశ్‌ (కెప్టెన్‌), బహదూర్‌ పాఠక్‌. 
డిఫెండర్స్‌: హర్మన్‌ప్రీత్‌ సింగ్, వరుణ్‌ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్‌ రొహిదాస్‌. 
మిడ్‌ఫీల్డర్స్‌: మన్‌ప్రీత్‌ సింగ్, చింగ్లెన్‌సన సింగ్, సర్దార్‌ సింగ్, వివేక్‌ సాగర్‌. 
ఫార్వర్డ్స్‌: సునీల్‌ విఠలాచార్య, రమణ్‌దీప్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, సుమిత్‌ కుమార్, ఆకాశ్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments