Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయుల గుండెల్లో బాధను నింపాను.. సాయం చేయండి: పాక్ హాకీ స్టార్ మన్సూర్

పాకిస్తాన్ హాకీ దిగ్గజ క్రీడాకారుడు మన్సూర్ అహ్మద్.. మూడు ఒలింపిక్ పతకాలను సాధించాడు. పాకిస్థాన్ కోసం ఎన్నో విజయాలు అందించాడు. కానీ అనారోగ్యం కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతనిని అఫ్రిద

Advertiesment
భారతీయుల గుండెల్లో బాధను నింపాను.. సాయం చేయండి: పాక్ హాకీ స్టార్ మన్సూర్
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (15:11 IST)
పాకిస్తాన్ హాకీ దిగ్గజ క్రీడాకారుడు మన్సూర్ అహ్మద్.. మూడు ఒలింపిక్ పతకాలను సాధించాడు. పాకిస్థాన్ కోసం ఎన్నో విజయాలు అందించాడు. కానీ అనారోగ్యం కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతనిని అఫ్రిది ఫౌండేషన్ సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తనకు భారత ప్రభుత్వం సాయం చేయాలని మన్సూర్ అహ్మద్ కోరుతున్నాడు. 
 
కరాచీలోని జిన్నా పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్‌ సెంటర్‌‌లో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం భారత్‌కు లేదా కాలిఫోర్నియాకు వెళ్లాలని వైద్యులు సూచించడంతో.. భారత్‌ను సాయం కోరారు. దీనిపై మన్సూర్ స్పందిస్తూ.. శస్త్రచికిత్స కోసం భారత్ వెళ్లాలనుకుంటున్నానని.. భారత్‌లోనే ఈ శస్త్రచికిత్స సక్సెస్ రేటు ఎక్కువగా వుందని తెలిపాడు.
 
కాలిఫోర్నియాతో పోల్చుకుంటే భారత్‌లో ఖర్చు కూడా తగ్గుతుందన్నాడు. అందుచేత భారత్‌లో తనకు శస్త్రచికిత్స జరిగేలా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. తాను ఆర్థిక సాయం కోరడం లేదని, నైతిక సాయం కావాలని కోరాడు. ఇప్పటికే తన ఆసుపత్రి రిపోర్టులను ఇండియన్ ఎంబసీకి పంపించానని, తనకు వీసా కావాలని కోరాడు.
 
గతంలో తాను ఎంతోమంది భారతీయుల గుండెల్లో బాధను నింపానని గతాన్ని గుర్తు చేసుకుని మన్సూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సుష్మాస్వరాజ్ స్పందించి మన్సూర్‌కి వీసా మంజూరు చేయాలని ఆతని ఫ్యాన్స్ కోరుతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ సీఎం మన్సూర్ చికిత్స కోసం లక్ష డాలర్ల సాయం ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ పుట్టినరోజు.. కోహ్లీతో షాంపేన్ తాగుతాడట..