Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ పుట్టినరోజు.. కోహ్లీతో షాంపేన్ తాగుతాడట..

మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన పుట్టినరోజును అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాస్టర్ తన పుట్టిన రోజు సందర్భంగా స

Advertiesment
Sachin Tendulkar
, మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:46 IST)
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన పుట్టినరోజును అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాస్టర్ తన పుట్టిన రోజు సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రచించిన 'ఎలెవెన్ గాడ్స్ అండ్ ఏ బిలియన్ ఇండియన్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా సచిన్ కేక్ కట్ చేసి.. తన భార్య అంజలికి తినిపించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. వన్డేల్లో తన పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమిస్తే ఏం చేస్తారు? అతనికి షాంపేన్ పంపుతారా?అంటూ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు.. షాంపేన్ బాటిల్స్‌ను పంపనని, తానే వెళ్లి కోహ్లీతో కలసి షాంపేన్ తాగుతానని బదులిచ్చాడు. దీంతో, అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. కాగా వన్డేల్లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం 35 సెంచరీలను సాధించిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ మొత్తం 34,357 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో 200 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
క్రికెట్ ఫ్యాన్స్‌కు దేవుడైన సచిన్‌కు ట్విట్టర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 200 టెస్టులాడిన సచిన్.. 51 సెంచరీలు సాధించాడు. ఆ టెస్టుల్లో 15921 పరుగులు సాధించాడు. 463 వన్డేలు ఆడిన మాస్టర్ 49 సెంచరీలతో 18426 పరుగులు సాధించాడు. 2013లో అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి స‌చిన్ రిటైర‌య్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2018 : ఢిల్లీ డేర్‌ డెవిల్స్ బ్యాట్స్‌మెన్లపై మండిపడిన గంభీర్