Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్.. ఎవరు?

మాస్టర్ బ్లాస్టర్. ఈ పేరు తెలియని వారుండరు. ఆయనెవరో కాదు సచిన్ టెండూల్కర్. పైగా, ఈయన రాజ్యసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆరేళ్ళపాటు పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించారు. అయితే సభకు వెళ్లిన రోజులు మాత్రం వేళ్లపై

Advertiesment
ఆరేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్.. ఎవరు?
, ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (17:26 IST)
మాస్టర్ బ్లాస్టర్. ఈ పేరు తెలియని వారుండరు. ఆయనెవరో కాదు సచిన్ టెండూల్కర్. పైగా, ఈయన రాజ్యసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆరేళ్ళపాటు పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించారు. అయితే సభకు వెళ్లిన రోజులు మాత్రం వేళ్లపై లెక్కించవచ్చు. ఈ విషయంలో సచిన్ విమర్శలపాలయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవలే సచిన్ రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఈ సందర్భంగా అతడు చేసిన ఓ మంచి పని చేశాడు. ఇది ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఆరేళ్లలో ఎంపీగా తనకు వచ్చిన జీతం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. 
 
ఈ ఆరేళ్లలో సచిన్‌కు జీతభత్యాల రూపంలో మొత్తం రూ.90 లక్షలు వచ్చాయి. సచిన్ విరాళాన్ని గుర్తిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. ఇది చాలా మంచి పని అని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పీఎంవో కొనియాడింది. 
 
అయితే సచిన్ తన ఎంపీ లాడ్స్‌ను మాత్రం సరిగ్గా వినియోగించుకున్నాడు. తనకు ఈ ఆరేళ్లలో వచ్చిన రూ.30 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా 185 పనులకు ఉపయోగించారు. అందులో రూ.7.4 కోట్లు కేవలం విద్య, దాని అనుబంధ రంగాలకు వినియోగించారు. 
 
ఇక సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద సచిన్ రెండు ఊళ్లను కూడా దత్తతకు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని దోంజా, ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాలను అతను దత్తతకు తీసుకొని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు తన జీతభత్యాల మొత్తాన్నీ విరాళంగా ఇచ్చి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను గ్యారేజ్‌లో పడేసిన తండ్రి (Video)