స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను గ్యారేజ్‌లో పడేసిన తండ్రి (Video)

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని యేడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను అతని తండ్రి పీటర్ గ్యారేజ్‌లో పడేశారు. ఇక యేడాది వరకు దాని అవసరం లేదంటూ ఆయన ఈ

ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (13:42 IST)
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని యేడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను అతని తండ్రి పీటర్ గ్యారేజ్‌లో పడేశారు. ఇక యేడాది వరకు దాని అవసరం లేదంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కిట్‌ను చూస్తూ ప్రతి రోజూ తన కొడుకు కుమిలిపోవడం తనకు ఇష్టం లేదని పీటర్ చెప్పారు. అతను బాగానే ఉన్నాడు.. ఈ సంక్షోభం నుంచి బయటపడతాడు.. అంటూ క్రికెట్ కిట్‌ను పడేసే సమయంలో పీటర్ అన్నారు. 
 
కాగా, దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి పర్యటన మధ్యలోనే స్మిత్ స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సిడ్నీలో స్మిత్ విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన తండ్రి పీటర్ వెనుకనే నిలబడి ఓదార్చారు. ఆస్ట్రేలియాను, అభిమానులను బాధపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ స్మిత్ ఫ్యాన్స్‌ను కోరాడు. 
 
మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లతో కలిసి స్మిత్ ఈ బాల్ ట్యాంపరింగ్‌కు ప్లాన్ చేశాడు. బాన్‌క్రాఫ్ట్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడంతో ఈ బాగోతమంతా బయటపడింది.

 

Steve Smith's Father Peter Smith Dumps His Cricket Kit pic.twitter.com/O7WArgbEZT

— Desi Stuffs (@DesiStuffs) March 31, 2018

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నా భర్తను ఐపీఎల్ టోర్నీలో ఆడనివ్వొద్దు : షమీ భార్య