Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్ : మూడో రౌండ్‌కు బోపన్న జోడీ... నాదల్ కూడా...

పారిస్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో టోర్నీలో భాగంగా, గురువారమైన ఐదో రోజు కూడా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. అంచనాలకు అనుగుణంగా రాణించిన టాప్‌సీడ్ ప్లేయర్లందరూ మూడోరౌండ్‌లోకి ప్రవే

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (07:16 IST)
పారిస్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో టోర్నీలో భాగంగా, గురువారమైన ఐదో రోజు కూడా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. అంచనాలకు అనుగుణంగా రాణించిన టాప్‌సీడ్ ప్లేయర్లందరూ మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. కెరీర్‌లో రెండో ఫ్రెంచ్ టైటిల్ కోసం వేట మొదలుపెట్టిన స్పెయిన్ క్రీడాకారిణి గాబ్రియేల్ ముగురుజా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో మూడోసీడ్ ముగురుజ 6-4, 6-3తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టింది.
 
అలాగే, పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-1, 6-1తో గుడియో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తొలిసెట్‌లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకున్న స్పెయిన్ బుల్ వరుసగా 9 గేమ్‌లను గెలిచాడు. మ్యాచ్ మొత్తం సాధారణమైన సర్వీస్‌లనే కొట్టిన నాదల్.. చివరి రెండు సెట్లలో మాత్రం మరింత దూకుడుగా ఆడాడు.
 
ఇకపోతే, పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చూపెడుతున్నారు. రెండోరౌండ్‌లో 13వ సీడ్ బోపన్న-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) 6-1, 6-2తో బెంజిమెన్ బోంజి-జార్జ్ జాక్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-ఫ్రాన్స్ జంట 4 ఏస్‌లతో చెలరేగింది. మ్యాచ్‌మొత్తంలో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments