బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్షన్

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (08:17 IST)
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ పోటీలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది.  వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రీడా పోటీల కోసం చైనా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా ఈ క్రీడల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
అదేసమయంలో ఈ క్రీడా పోటీలు జరిగే బీజింగ్‌లో జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వ అధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు బీజింగ్ నగరం చుట్టూత ఉన్న నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పోటీలను నిర్వహించితీరాలన్న పట్టుదలతో ఉన్న చైనా అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. 
 
బీజింగ్ సిటీకి సమీపంలో ఉన్న షియాన్ నగరంలో ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. పైగా, ఈ వైరస్ శరవేగంగా వ్యాపించే అవకాశాలు ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, ఈ వైరస్ కట్టిడి కోసం టియాంజిన్ నగరంలోని 1.5 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు యుద్ధప్రాతిపదికన చేయాలని అధికారుల నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫార్ములా ఈ-కార్ రేస్ అవినీతి కేసు: కేటీఆర్‌పై విచారణకు అనుమతి

చంద్రబాబు ఒక అన్‌స్టాపబుల్ : ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఐటీ నిపుణుల మాదిరిగా తెలుగు రైతులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: చంద్రబాబు నాయుడు

Hyderabad : లిఫ్ట్ బయటి గ్రిల్ గేట్లలో చిక్కుకుని ఐదేళ్ల ఎల్‌కేజీ విద్యార్థి మృతి

ప్రైవేట్ బస్సును ఢీకొన్న యాసిడ్ ట్యాంకర్‌.. ఎవరికి ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

తర్వాతి కథనం
Show comments