Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పావురం కలకలం... చైనాదేనా?

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పావురం కలకలం... చైనాదేనా?
విజ‌య‌వాడ‌ , బుధవారం, 5 జనవరి 2022 (15:24 IST)
ప్ర‌కాశం జిల్లా చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్ తో కూడిన పావురం కలకలం రేపుతోంది. కాలుకు కోడ్ తో కూడిన రబ్బర్ ట్యాగ్ తో ఇది చైనా గూఢ‌చ‌ర్య పావురమంటూ ప్రచారం జ‌రుగుతోంది. ఇటీవల ఒడ్డిస్సా, కటక్, కేంధ్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిదిలోని దశరథపుర్, పురి జిల్లా హరికృష్ణా పుర్ పంచాయితీలో రహంగిరియాలలో ఇదే తరహాలో పావురాలు బయటపడ్డాయి. 
 
 
ఇక్క‌డ కూడా అలాగే చైనా కోడ్ తో కూడిన పావురం స్థానికులకు చిక్కడంతో చీమకుర్తిలో కలకలం మొద‌లైంది. ఒడ్డిస్సా రాష్టంలో పట్టుబడ్డ పావురాల కాలికి ఉన్న రబ్బర్ ట్యాగ్ పై వీహెచ్ ఎఫ్ వైజాగ్ 19742021 ముద్రించి ఉండటంతో పోలీసులు ఆ పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. పురి జిల్లా హరికృష్ణా పుర్ పంచాయితీలో రహంగిరియా గ్రామస్థులకు గత సోమవారం చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ తో పాటు మరోకాలికి 37 కోడ్ అంకెతో కూడిన ట్యాగ్ తో ఉన్న పావురాన్ని పోలీసులు  స్వాదీనం చేసుకున్నారు. 
 
 
అదే తరహాలో చీమకుర్తి నెహ్రూనగర్ లోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటున్న నాగరాజు అనే స్థానికుడికి ఈ పావురం చిక్కింది. పావురం కాలిపై రబ్బర్ ట్యాగ్ పై ఎయిర్ అనే పదం అడ్డంగా, 2019 నిలువుగా 2207 ఉన్న కోడ్స్ ఉన్నాయి. గత కొంత కాలంగా మిగతా పావురాలతో పాటు ఈ పావురం కూడా వస్తూ పోతుండేదని, కాని కొత్తగా కాలికి ఏదో ట్యాగ్ ఉండటంతో దానిని పట్టుకొని పరిశీలించగా, ఈ ఘటన వెలుగు చూసినట్లు స్థానికలు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హడలెత్తిస్తున్న కరోనా వైరస్ : కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం