Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్: మితర్వాల్ అదుర్స్.. భారత వెయిట్‌లిఫ్టర్ల కొత్త రికార్డు

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడలో మితర్వాల్‌ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే 50మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంల

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (11:23 IST)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడలో మితర్వాల్‌ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే 50మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్య పతకం సాధించాడు. ఇప్పటివరకు భారత్‌కు 22 పతకాలు రాగా.. అందులో 11 బంగారం, 4 రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో ఎక్కువ పతకాలు సాధించిన లిస్ట్‌లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది.
 
మరోవైపు 21వ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు కొత్త చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో అత్యధికంగా 9 పతకాలు సాధించి బరిలో నిలిచిన 35 దేశాల కంటే అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా ఐదు స్వర్ణ, రెండు రజత, రెండు కాంస్య పతకాలతో 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో భారత వెయిలిఫ్టర్లు ప్రథమ స్థానంలో ఉన్నారు.
 
ఇదిలా ఉంటే.. తెలుగు తేజం.. భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున మెన్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ గురువారం విడుదల చేయబోయే జాబితాలో 25 ఏళ్ల శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్ దక్కబోతోంది. తద్వారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తర్వాత శ్రీకాంత్ ఈ రికార్డు కొల్లగొట్టనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments