కామన్వెల్త్ క్రీడలు : 'గోల్డ్' గెలిచిన గుంటూరు కుర్రోడు
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్టే వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీలు 2018లో భారత్‌కు మరో స్వర్ణ పతకం దక్కింది. ఈ క్రీడా పోటీల్లో భాగంగా మూడో రోజైన శనివారం జరిగిన పురుషుల 85 కేజీల వెయిట్‌లిఫ్టింగ
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్టే వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీలు 2018లో భారత్‌కు మరో స్వర్ణ పతకం దక్కింది. ఈ క్రీడా పోటీల్లో భాగంగా మూడో రోజైన శనివారం జరిగిన పురుషుల 85 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఈ బంగారు పతకం వరించింది.
ఈ విభాగంలో పాల్గొన్న భారత వెయిట్‌లిఫ్టర్ ఆర్.వి.రాహుల్ అలవోకగా 85 కేజీల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంతకీ ఈ రాహుల్ గుంటూరు కుర్రోడు కావడం గమనార్హం. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం నాలుగు బంగారు పతకాలు చేశాయి.
అంతకుముందు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 77 కేజీల విభాగంలో సతీష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోనే మీరాబాయి చాను తొలి స్వర్ణాన్ని అందించగా, మలి స్వర్ణాన్ని మరో వెయిట్ లిఫ్టర్ సంజిత చాను శుక్రవారం అందించిన విషయం తెల్సిందే.
ఇక మూడో స్వర్ణాన్ని పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సతీష్ కుమార్ శివలింగం సొంతం చేసుకోగా, నాలుగో స్వర్ణపతకాన్ని గుంటూరు కుర్రోడు రాహుల్ దక్కించుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.