Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వర్ణ పతకం సాధించిన తెలుగుతేజం... గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురం నుంచి...

విజయవాడ: కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిప్టింగ్ 85కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగుతేజం రాగాల వెంకటరాహుల్‌కు రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకం సాధించిన వెంకట రాహుల్ గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చె

Advertiesment
Venkat Rahul Ragala
, శనివారం, 7 ఏప్రియల్ 2018 (22:26 IST)
విజయవాడ: కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిప్టింగ్ 85కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలుగుతేజం రాగాల వెంకటరాహుల్‌కు రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు తెలియజేశారు. స్వర్ణ పతకం సాధించిన వెంకట రాహుల్ గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన రాగాల మధు కుమారుడని మంత్రి తెలిపారు. వ్యవసాయం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వెంకటరాహుల్ గోల్డ్ మెడల్ సాధించటం గర్వించదగ్గ విషయంమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 85 కేజీల విభాగంలో 187 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించిన రాగాల వెంకట రాహుల్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పోత్సాహం అందించి ప్రోత్సహించామని ముఖ్యమంత్రితో చర్చించి భవిష్యత్తులోను అన్ని విధాల సహాయం అందించటం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. 
 
రాగాల వెంకట రాహుల్ తెలుగుజాతి కీర్తి పతాకాన్నీ విశ్వవ్యాప్తం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెంకట రాహుల్‌ను ఆదర్శంగా తీసుకుని క్రీడలలో భవిష్యత్ తరాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్ లాండ్స్ రాష్ట్రంలో "గోల్డ్ కోస్టు సిటీ"లో కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్నందున ఈ క్రీడలను" గోల్డ్ కోస్ట్ 2018 గేమ్స్"గా పిలుస్తున్నారు. కామన్వెల్త్  గేమ్స్‌లో గతంలో బ్రిటీష్ పాలనలో ఉన్న మొత్తం దేశాలతో పాటు, ఇటీవల ఈ క్రీడలలో పాల్గోంనేందుకు ముందుకొచ్చిన మరికొన్ని దేశాలతో కలిపి, మొత్తం 70 పైగా దేశాలకు చెందిన 6600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. 
 
ఈ నెల 4వ తేది నుండి 15వరకు జరిగే ఈ క్రీడలలో ఇప్పటికే మన దేశం రాహుల్ సాధించిన ఈ పతకంతో కలిపి మొత్తం నాలుగు బంగారు పతకాలు సాధించారని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట రాహుల్ ఒలింపింక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఆంధ్రుల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఉన్నత స్థానానికి చేర్చుతారన్న ఆశాభావాన్ని మంత్రి రవీంద్ర వ్యక్తం చేశారు. తెలుగువారు అందులో ఆంధ్రులు పౌరుషం, పట్టుదల, ప్రతిభలోను దేశంలో ఏ ఒక్కరికి తీసిపోరన్న విషయాన్ని రాహుల్ తనకృషి, కఠోర దీక్షతో ప్రతిభను చాటి మరోమారు నిరూపించారని మంత్రి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకులకు చేదు వార్త