Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకులకు చేదు వార్త

రైళ్ళలో ప్రయాణించే వారికి ఇది నిజంగా చేదు వార్తే. మీరు రైళ్ళలో ప్రయాణించేటప్పుడు ఎవరైనా చైన్లను బయట నుంచి దొంగిలించి తీసుకెళితే రైల్వేశాఖకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మీరు చదువుతున్నది నిజమే.

Advertiesment
chain snatcher
, శనివారం, 7 ఏప్రియల్ 2018 (18:15 IST)
రైళ్ళలో ప్రయాణించే వారికి ఇది నిజంగా చేదు వార్తే. మీరు రైళ్ళలో ప్రయాణించేటప్పుడు ఎవరైనా చైన్లను బయట నుంచి దొంగిలించి తీసుకెళితే రైల్వేశాఖకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మీరు చదువుతున్నది నిజమే. 
 
రాజస్థాన్‌కు చెందిన నంద అనే ప్రయాణీకుడు చెన్నై నుంచి దురంద ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఇటాలాచి అనే రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ వద్ద రైలు ఆగుతుండగా ఒక్కసారిగా అతని మెడలోని చైనును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్ళాడు. దొంగతనం జరిగిన తరువాత దొంగను పట్టుకునేందుకు ప్రయాణించారు తోటి ప్రయాణీకులు. 
 
అయితే రైల్వే పోలీసులు, టిటిలు రైలులో ఉన్నా కూడా ఎసి బోగీలలో పడుకొని ఉండటంతో దొంగను పట్టుకోలేకపోయారు. దీంతో బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. బాధితుడికి 36 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది వినియోగదారుల ఫోరం. దీంతో రైల్వేశాఖ కోర్టుకు వెళ్ళింది. 
 
దొంగ బయట నుంచి దొంగతనానికి పాల్పడితే మాకేంటి సంబంధం అని రైల్వేశాఖ న్యాయమూర్తికి వివరించింది. దీంతో న్యాయమూర్తికి జరిగిన సంఘటనకు రైల్వేశాఖకు ఎలాంటి సంబంధం లేదు. దొంగ బయట నుంచి చైను లాక్కెళ్ళిపోయాడు. దీంట్లో రైల్వేశాఖకు ఏం సంబంధం ఉంటుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం రైల్వేశాఖకు లేదంటూ సుప్రీంకోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఇక రైళ్ళలో ప్రయాణించేటప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా రైల్వేశాఖకు ఎలాంటి సంబంధం ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనకు జనాదరణ తగ్గుతోందా? ఎందుకు?