పూజకు తులసీ ఆకులను అలా త్రుంచితే ఏమవుతుందో తెలుసా?

తీర్థము తీసుకునేటపుడు మూడుసార్లు విడివిడిగా, ఒకదాని తరువాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకే కాలవమును తీసుకొనరాదు. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు ఒత్తులను దీపారాధన

Webdunia
బుధవారం, 4 జులై 2018 (15:23 IST)
దేవాలయానికి వెళ్లినప్పుడు తీర్థము తీసుకునేటపుడు మూడుసార్లు విడివిడిగా, ఒకదాని తరువాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకే కాలవమును తీసుకొనరాదు. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో రెండు ఒత్తులను దీపారాధనగా వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.
 
సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. దైవ ప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు. దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. 
 
పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. యుద్ధమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని, విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు, హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. 
 
లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫోటోగాని, విగ్రహంగాని ఉంచుకుంటే మంచిది. నిలబడి ఉన్నది వాడరాదు. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. ఉదయం, సాయంకాలం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. తులసి దళములను పూజ చేయునపుడు దళములుగానే వెయ్యాలి. ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాదాస్పద ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్ వచ్చింది..

కేతన్‌ను ప్రియుడితో కలిసి చంపేశాం.. పారిపోతే పరువు పోతుందని.. సియా

వెనిజులా భారీ భూకంపం, 40 వేల మంది మిస్సింగ్, శిథిలాల కింద ఆర్తనాదాలు

నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం

రీల్స్ కోసం గోవా బీచ్ రాళ్లపై కూర్చున్నాడు, రాకాసి అల లాక్కెళ్లింది, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

తర్వాతి కథనం
Show comments