దైవానికి కొబ్బరికాయ కొట్టే ముందు.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (15:38 IST)
సాధారణంగా చాలామంది వారు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగే దేవుళ్లందరుకు కొబ్బరికాయ కొట్తానని మొక్కుకుంటారు. అలానే కొట్టిన కొబ్బరికాయ కుళ్లినప్పుడు చాలా ఆందోళన చెందుతుంటారు. ఏం చేయాలి స్వామి ఇలా అయిపోయిందే అంటూ.. చింతిస్తుంటారు. అసలు కొబ్బరికాయను భగవంతులకు ఎందుకు కొట్టాలో తెలుసుకుందాం...
 
దైవానికి కొబ్బరికాయ కొట్టటం శాంతికారకం, అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను కొట్టటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొబ్బరికాయను భగవంతునికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత భగవంతునికి స్మరిస్తూ దానిని కొట్టాలి. 
 
రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ కోణంగా ఉండేటట్లు చూసుకోవాలి. కొబ్బరికాయ సరిసమానంగా పగలటం మంచిదే. అయితే ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ లేదా కుళ్లిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు. 
 
అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకుని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచి ఆ పాత్రలోని కొబ్బరినీటితో మాత్రమే అభిషేకం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

తర్వాతి కథనం
Show comments