కాలభైరవుడిని ఏ రాశుల వారు.. ఏ రోజు పూజించాలంటే?

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (16:21 IST)
శివుడి స్వరూపం అయిన కాల భైరవుడిని ఏ రాశుల వారు ఏ రోజు పూజించాలో, ఎలా పూజించాలో చూద్దాం. శివుని 64 రూపాలలో భైరవుడు ఒకటి. స్వర్ణాకర్షణ భైరవుడు, యోగ భైరవుడు, ఆది భైరవుడు, కాల భైరవుడు, ఉగ్ర భైరవుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు
 
ప్రతి శివాలయానికి ఈశాన్య మూలలో భైరవుని గర్భగుడి ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే అష్టమి రోజు చాలా విశిష్టమైనవిగా భావిస్తారు. అష్టమి తిథిలలో భైరవ వ్రతం పాటిస్తారు. మంగళవారం అష్టమి తిథి చాలా విశిష్టమైనది. వరుసగా 21 అష్టమి తిథిలు భైరవ వ్రతం ఆచరించడం చాలా విశిష్టమైనది. 12 రాశుల వారు ఈ ప్రత్యేకమైన అష్టమి తిథి రోజున భైరవుడిని పూజిస్తే గొప్ప ఫలితాలు పొందవచ్చు.
 
ఆదివారం సింహ రాశి స్త్రీలు, పురుషులు రాహుకాలంలో భైరవుడికి అర్చన, రుద్రాక్ష అభిషేకం, వడ మాలలు వేసి పూజలు చేస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి.
 
సోమవారం కర్కాటకరాశి వారు సోమవారం లేదా సంకష్టహర చతుర్థి రోజున భైరవుడికి పన్నీరుతో అభిషేకం చేసి, చందనం , పునుగుతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే కంటి సమస్యలు దూరం అవుతాయి. 
 
మేష, వృశ్చిక రాశి వారు మంగళవారం భైరవుడిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. మిరియాల దీపం వెలిగించి పూజిస్తే పోయిన ఆస్తిని తిరిగి పొందవచ్చు.
 
బుధవారం మిథున, కన్యా రాశుల వారు బుధవారాలలో భైరవుడిని పూజించడం ద్వారా లాభాలను పొందవచ్చు. నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లాభం చేకూరుతుంది.
 
గురువారం ధనుస్సు, మీన రాశి భైరవుడిని గురువారాల్లో పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గురువారం పూజ చేస్తే శుభఫలితాలు వుంటాయి. 
 
శుక్రవారం, వృషభ, తుల రాశుల వారు శుక్రవారం నాడు కాల భైరవుడిని పూజించడం ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. శుక్రవారం సాయంత్రం బిల్వ ఆకులు, సుగంధ పుష్పాలతో సహస్రనామ అర్చన చేస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది.
 
శనివారం మకర, కుంభ రాశుల వారు శనివారం భైరవుడిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. భైరవుడు శనిదేవుని గురువు. ఫలితంగా అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని తొలగి మంచి జరుగుతుందని విశ్వాసం. అలాగే అష్టమి నాడు పంచ దీపాలు వెలిగించి పూజిస్తే కష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

దయచేసి నన్ను విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే వుండండి, ఆపొద్దు: తమిళనాడు సీఎం విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

తర్వాతి కథనం
Show comments