శుక్రవారం (23-12-2022), అమావాస్య, మూల నక్షత్రం కలయికతో వచ్చిన ఈ రోజు సాయంత్రం హనుమంతుని ఆలయంలోనేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుడు చిరంజీవి. ఆయన రామాయణం, మహాభారత సమయంలో వున్నారు. మార్గశిర మాసంలో వచ్చే మూల నక్షత్రం రోజున హనుమజ్జయంతిగా కొన్ని ప్రాంతాల్లో పూజలు చేస్తారు. ఈ పూజల్లో పాల్గొనడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఈ రోజున ఉపవసించి సాయంత్రం పూట హనుమంతుని ఆలయంలో దీపం వెలిగించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఈ రోజున వెన్న, తమలపాకుల మాల, వడమాల సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం సమీపంలోని హనుమంతుని ఆలయాన్ని సందర్శించడం చేయాలి. అటుకులను ఆయనకు సమర్పించి ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టడం ద్వారా ఈతిబాధలుండవు. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.