Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకుంఠ ఏకాదశి.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే..?

Advertiesment
vaikunta ekadasi 2023
, సోమవారం, 2 జనవరి 2023 (10:10 IST)
ఏకాదశిని నెలకు రెండుసార్లు జరుపుకుంటారు, ఇది శుక్ల పక్షం, కృష్ణ పక్షం 11వ రోజున వస్తుంది. పారణ సమయంలో ద్వాదశి తిథితో ముగుస్తుంది. విష్ణు భక్తులు వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున అపారమైన భక్తి, అంకితభావంతో ఉపవాసం ఉంటారు. ఇంకా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని 108 సార్లు జపిస్తూ వారి రోజును గడిపితే మోక్షం సిద్ధిస్తుంది.  
 
చాంద్రమానంలోని మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని "మోక్షద ఏకాదశి" అంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉండి శ్రీ హరికి ప్రార్థనలు చేస్తారు. భీష్ముడు కూడా ఈ రోజునే మరణించాడని విశ్వాసం. 
 
అందుకే ఈ ప్రత్యేక ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి చాలా శక్తివంతమైనదని కూడా నమ్ముతారు. ఇది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా శుభ్రపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 
 
భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీరంగం, తిరుపతి ఆలయాలు ఏకాదశి వేడుకలకు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందాయి. భద్రాచలంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో కూడా ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. ఆ దర్శనంతో పునర్జన్మ ఉండదు..