Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుని శరీరమంతా సిందూరం ఉంటుంది.. ఎందుకు..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:58 IST)
సిందూరం అంటే పెట్టుకునే కుంకుమ. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతమ్మను అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పారు.
 
ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే ఆంజేయుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. 
 
ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు.. ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అని అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.  
 
కనుక ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుసార్లు హనుమంతుని సింధూరాభిషేకం చేయించి.. స్వామివారికి నచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తే వారు కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. దాంతో పాటు రాములవారి దర్శనం కూడా దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments