Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-03-2019 గురువారం దినఫలాలు - ఆ రాశివారు వ్యాపారాల్లో...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (08:57 IST)
మేషం: ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. బంధువులను కలుసుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల, దైవ కార్యక్రమాలపట్ల మక్కువ పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
వృషభం: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొబ్బరి, పండ్లు, పూల చిరువ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో ఒకరి సహాయం తీసుకోవడం మంచిది. బంధువులకు ధన సహాయం చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మిధునం: వ్యాపారాల్లో స్థిరపడడంతో పాటు అనుభవం గడిస్తారు. మీ తొందరపాటుతనం, మతిమరుపు కారణంగా అధికారులతో మాటపడుతారు. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత, పునరాలోచన మంచిది. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం: పెద్దలతోను, ప్రముఖులతోనూ మితంగా సంభాషించండి. ఊహించని ఖర్చుల వలన చేబదుళ్ళు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలిస్తాయి. 
 
సింహం: ప్రింటింగ్ రంగాల వారికి బాకీళ వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కుంటారు.
 
కన్య: మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. 
 
తుల: సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. సోదరీసోదరుల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం వలన మెరుగైన ఫలితాలు పొందుతారు. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. 
 
వృశ్చికం: విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. షాపు గుమస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుండి ఆహ్వానం, కానుకలు అందుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
ధనస్సు: దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఏకాగ్రత, మెళకువ అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడుతాయి. నిజాయితీగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.  
 
మకరం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది.  
 
కుంభం: క్రీడా, కళా రంగాల్లో వారికి సంతృప్తికానరాదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. నిరుద్యోగులు గట్టిపోటి ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మీనం: కపటంలేని మీ ఆలోచనులు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది కాదని గమనించండి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments