Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

03-03-2019 ఆదివారం దినఫలాలు - బంధుమిత్రులతో కలిసి...

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 3 మార్చి 2019 (09:50 IST)
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది. క్రయవిక్రయాలు లాభదాయకం. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
వృషభం: వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమార్గం గోచరిస్తుంది. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు అనుకూలిస్తాయి. నూతన సందర్శనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిధునం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. మత్స్స, కోళ్ళ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి. భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.
 
కర్కాటకం: కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. సన్నిహితులలో మార్పు మీకెంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పనిభారం బాగా పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ప్రేమికులకు పెద్దల నుండి ఇబ్బందులు తప్పవు.
 
సింహం: కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. స్త్రీలకు వస్త్ర, ఆకస్మిక ధనలాభం వంటి శుభపరిణామాలున్నాయి. పెద్దలకు ఔషధ సేవ తప్పదు.
 
కన్య: మీ వాహనం ఇతరులకిచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఒక ముఖ్య విషయమై న్యాయసలహా పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. దైవ కార్యాలు మానససిక ప్రశాంతత నిస్తాయి. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ధనసహాయం, హామీలకు దూరంగా ఉండడం మంచిది.  
 
తుల: గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాలవారికి సామాన్యం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యుత్. ఎ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి పనిభారం అధికం. ఖర్చులు పెరగడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు.
 
వృశ్చికం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టండి. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.  
 
ధనస్సు: సన్నిహితులతో కలిసి సమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మిత్రులతో కలిసివిందు, వినోదాల్లో పాల్గొంటారు. 
 
మకరం: విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. స్త్రీల అభిప్రాయాలకు మిశ్రమ స్పందన లభిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
కుంభం: చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చలు, కీలకమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు అధికమించి అనుభవం గడిస్తారు. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
మీనం: రాజకీయ రంగాల్లో వారికి అప్రమత్తత అవసరం. నూతన దంపతుల శుభవార్తలు వింటారు. కుటుంబీకుల కోసం విరివిగా ధనం వ్యయం చేస్తారు. క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బంధువులరాకతో గృహంలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. నూతన ప్రదేశ సందర్శనాలు, పుణ్యక్షేత్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాశివరాత్రి వ్రత కథ ఏమిటో తెలుసా?