Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-02-2019 బుధవారం దినఫలాలు : ఈ రాశివారు మానసికంగా ప్రశాంతంగా..

27-02-2019 బుధవారం దినఫలాలు : ఈ రాశివారు మానసికంగా ప్రశాంతంగా..
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:06 IST)
మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అధికారులు ధనప్రలోభాల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు.
 
వృషభం: ఆర్థిక వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలను సమర్థంగా నడిపిస్తారు. సన్నిహితులకు మీపై అపోహలు తొలగిపోగలవు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. 
 
మిధునం: ఒకేసారి అనేక పనులు మీదపడడంతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సాన్నిత్యం నెలకొంటుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాల దిశగా ఆలోచిస్తారు.
 
కర్కాటకం: ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు చక్కని పరిష్కారమార్గం గోచరిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
సింహం: మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. జాయింట్ వెంచర్లు, ఏజెన్సీలు, లీజు గడువు పొడిగింపులకు అనుకూలం. నచ్చని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. కోర్టు, ఆస్తి, భూ సంబంధిత వివాదాలు జఠిలమవుతాయి. రుణయత్నం ఫలించి ధనం అందుతుంది. ఆరోగ్య విషయంలో ఏమరుపాటు తగదు.
 
కన్య: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు సంభవం. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రావలసిన ధనం అందుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
తుల: కుటుంబీకులు మీ ఆసక్తితను అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. హోటల్, క్యాటరింగ్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దైవకార్యం పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
వృశ్చికం: ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో పట్టింపులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
ధనస్సు: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. భాగస్వామికులకు మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణంతో ఇబ్బందులెదుర్కుంటారు. ఇసుక కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, జరిమానాలు తప్పవు. 
 
మకరం: ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సాన్నిత్యం నెలకొంటుంది. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం తధ్యం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా వ్యక్తం చేయండి. స్వలాభం కంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. లైసెన్సుల రెన్యూవల్‌లో నిర్లశక్ష్యం వద్దు. 
 
కుంభం: కిరణా, ఫ్యాన్యీ, రసాయన, సుగంద ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఆశాజనకం. పారిశ్రామిక, రవాణా రంగాల వారు స్వల్ప చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. 
 
మీనం: ఆదాయానికన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావలసి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రలేవగానే తల్లిదండ్రులను చూస్తే..?