25-02-2019 సోమవారం దినఫలాలు - స్త్రీలు ఆ విషయాల్లో రాణిస్తారు

సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:14 IST)
మేషం: టీ.వీ కార్యక్రమాల్లో స్త్రీలు రాణిస్తారు. మీ సంతానం విద్యా విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకటానికి గురిచేసేందుకు యత్నిస్తారు. ఎలక్ట్రానిక్ ఛానెళ్ల సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు సంతృప్తినిస్తుంది.
 
వృషభం: బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు, తరచు ప్రయాణాలు తప్పవు. ముఖ్యుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
మిధునం: పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఆశించిన ప్రయోజనం ఉంటుంది. పత్రికా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా ఏమాత్రం గుర్తింపు ఉండదు. ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాలవారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. అనుకున్న పనులు వాయిదా వేయడం మంచిది.
 
కర్కాటకం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావడంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి.
 
సింహం: విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిట్స్, ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఎదుటివారి విషయాల్లో అతిగా వ్యవహరించడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి.
 
కన్య: కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. మిమ్మల్ని అవహేళన చేసినవారు మీ సహాయం ఆర్ధిస్తారు. పాతమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. ప్రేమికులు ప్రతి విషయంలో లౌక్యంగా మెలగవలసి ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి మెళకువ అవసరం. 
 
తుల: మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రావలసిన ధనం సకాలంలో అందుటవలన పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. కొత్త రుణాలకోసం అన్వేషిస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
వృశ్చికం: రాజీ ధోరణితో వ్యవహరించడం వలన ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. రవాణా రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.  
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ప్రయాసలు అధికం. వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యవసరవస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. 
 
మకరం: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మిమ్ములను పొగిడే వారిని ఓ కంట కనిపెట్టడం ఉత్తమం. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. 
 
కుంభం: పత్రికా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా ఏమాత్రం గుర్తింపు ఉండదు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.  
 
మీనం: గృహోపకరణాలను అమర్చుకోవడంలో మునిగిపోతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకం. బంధుమిత్రులతో విభేదాలు తీరుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తుల వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీవారికి సమర్పించే నైవేద్యాన్ని ఎవ్వరూ చూడరట..