Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-03-2019 శుక్రవారం దినఫలాలు - దంపతులకు ఏ విషయంలోనూ...

Advertiesment
01-03-2019 శుక్రవారం దినఫలాలు - దంపతులకు ఏ విషయంలోనూ...
, శుక్రవారం, 1 మార్చి 2019 (08:53 IST)
మేషం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు తప్పదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కుంటారు. రుణాలు తీరుస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
వృషభం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మిధునం: ఆలయాలను సందర్శిస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం: ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. తాపి పనివారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. నిరుద్యోగులు చిన్న అవకాశానన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
సింహం: దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. తల, పొట్టకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు మిత్ర బృందాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
కన్య: ఆర్థిక, ఆరోగ్య విషయాలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. రాబోయే ఆదాయనికి తగినట్టుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. మీ అవసరాలు, బలహీనతలు గమనించి ఇతరులు మిమ్ములను మోసగించేందుకు యత్నిస్తారు. 
 
తుల: గృహమునకు కావలసిన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయాలలో వారికి గుర్తింపుతో పాటు చికాకులు కూడా అధికం. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోవారికి సదవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. సంగీత, నృత్య, సాహిత్య కళాకారులకు గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ప్రముఖుల కలయికవలన ఆశించిన ఫలితం ఉంటుంది. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమంకాదు. 
 
ధనస్సు: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. సహోద్యోగులతో తలెత్తిన వివాదాలు సమసిపోగలవు. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.  
 
మకరం: ప్లీడరలు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవర పెడతాయి. రవాణా, న్యా, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
కుంభం: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. పాత మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. వ్యాపారంలో ఎంతో పక్కగాతయారు చేసుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. 
 
మీనం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. సొంతంగా ఏదైనా వ్యాపారాలం చేయాలనేమీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. ఒక సమస్య పరిష్కారం కావడంతో మనస్సు తేలికపడుతుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-03-2019 నుండి 31-03-2019 వరకు మీ మాస రాశిఫలితాలు(Video)