మాఘమాసం ప్రయాగలో స్నానం చేస్తే.. భీష్మ ద్వాదశి.. ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే..?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (05:00 IST)
శివకేశవులకు మాఘ మాసం విశిష్టమైనది. ఎంతో ప్రీతికరమైనది. మాఘ మాసంలో ఉదయం విష్ణు ఆలయం, సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది. మాఘ మాసం పుణ్య తీర్థాల్లో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. 
 
అలాంటి ఈ మాఘ మాసంలో వచ్చే ప్రదోషం రోజున సాయంత్రం పూట శివాలయంలో జరిగే అభిషేకాలను కళ్లారా వీక్షిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. మాఘ ప్రదోష వ్రతం ఫిబ్రవరి 24 (బుధవారం) వస్తోంది. భీష్మ ద్వాదశి అయిన ఈ రోజున వచ్చే ప్రదోష కాలంలో పంచాక్షరిని 108 సార్లు శివాలయంలో స్తుతిస్తే.. సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చేయగల సమర్థుడు. అందుకే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయం అవుతుండా స్నానం చేస్తే మహా పాతకాలు నశిస్తాయి. 
 
ఈ మాసంలో ప్రయాగలో స్నానమాచరిస్తే.. పునర్జమ్మ అంటూ వుండదు. మాఘమాసంలో ఆదివారాలు విశిష్టమైనవి. ఆదివారం నాడు సూర్యుడుని భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకు ఇష్టమైన గోధుమతో చేసిన పదార్థాన్ని కాని.. తీపి పొంగలి కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments