Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శామ్సంగ్ గ్యాలక్సీ F 62 ఆఫ్ లైన్ లాంచ్, రిలయన్స్ డిజిటల్- జియో స్టోర్‌లో

శామ్సంగ్ గ్యాలక్సీ F 62 ఆఫ్ లైన్ లాంచ్,  రిలయన్స్ డిజిటల్- జియో స్టోర్‌లో
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (18:17 IST)
కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F 62 లాంచ్ కొరకు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ ఆఫ్ లైన్ భాగస్వాములుగా నిర్ణయించబడ్డారు. ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్సులో కస్టమర్లు లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అనుభూతిని ఆస్వాదించి, కొనుగోలు చేయగలుగుతారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ వైడ్ నెట్వర్క్ మొత్తం దేశమంతటా కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F 62 అందుబాటులో ఉండేలా చేస్తుంది, కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకునే ఆసక్తి గల కస్టమర్లకు ఈ పవర్ఫుల్ డివైస్ యొక్క ఫస్ట్ హ్యాండ్ అనుభూతి లభిస్తుంది.
   
కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F 62 ఫోన్ శామ్సంగ్ 7nm ఎక్సినోస్ 9825 2.73 GHz ఆక్టా కోర్ ప్రోసెసర్‌తో శక్తివంతమైనది. ఇది 128 GB ఎక్సపాండ్బుల్ స్టోరేజ్ మరియు కలర్ సూపర్ AMOLED  స్క్రీన్ తో ఏర్పాటు చేయబడింది. ఈ ఫీచర్లు సెగ్మంట్-లీడింగ్ 7000 mAh బ్యాటరీతో కలిగి, దీనిని గేమర్స్‌కు డ్రీమ్ ఫోన్‌గా మార్చుతున్నవి. ఈ ఫోన్ ఇన్ట్యూటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు మరియు ఫేస్ అన్లాక్ ఆప్షన్లతో కూడా సెక్యూర్‌గా ఎనేబుల్ చేయబడింది.
 
అల్ట్రా వైడ్ మరియు మేక్రో షూటింగ్ అందించే 64 MP రియర్ కెమేరాతో, ఇంకా 6 GB RAM కలిగినది రూ. 21,499/లో లేదా 8 GB RAM కలిగినది రూ. 23,499/- అందుబాటు ధరలలో చక్కని ప్రైస్ పాయింటులో వస్తున్నది, వీటితో ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద రూ. 2,500/- ఇన్స్టాంట్ డిస్కౌంట్ లేదా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క EMI మీద రూ. 2,500/- వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్ కూడా చేరి ఉన్నవి.
  
భాగస్వామ్యం గురించి మట్లాడుతూ శ్రీ బ్రియాన్ బేడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ - రిలయన్స్ డిజిటల్, “కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 ని ఇండియా అంతటా కస్టమర్లకు అందించుటలో మేము మాత్రమే ఆఫ్ లైన్ భాగస్వామి కావటం మాకు ఆనందం కలగజేస్తున్నది. కస్టమర్లకు ఈ ఫోన్ అనుభవం పొందుటలో మొట్టమొదటివారు కావటం, కొనటం కొరకు దేశమంతటా వ్యాపించిన మా రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ యొక్క లార్జ్ నెట్వర్క్ సహకరిస్తుంది. ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ ద్వారా మరియు ముఖ్యంగా చాలామందికి కొనుగోలు కొరకు అందుబాటులో ఉండే దీని ధర పట్టిక వల్ల కస్టమర్లు చాలా థ్రిల్ అవుతారని మేము నమ్ముతున్నాం.” అన్నారు.
 
రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లో కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F 62 కొనుగోలు చేయాలని ఎంచుకునే జియో కస్టమర్లు, లాంచ్ సమయంలో రూ. 10,000/- విలువైన ప్రయోజనాలతో ఇతర ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా పొందగలరు. ఈ ప్రయోజనాలలో, రూ. 349/- ప్లాన్లో మీరు ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకొని రూ. 3,000/- ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ మరియు పార్టనర్ బ్రాండ్స్ నుండి రూ. 7,000/- విలువైన వోచర్లుపొందవచ్చు. ఈ ఆఫర్ కొత్త మరియు ప్రస్తుతం ఉన్న అందరు జియో సబ్-స్క్రైబర్స్‌కు వర్తిస్తుంది. నియమములు మరియు షరతులు వర్తించును.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్