Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Advertiesment
CM Jagan
, శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (17:01 IST)
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రథాన్ని ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు సీఎం జగన్‌కు హెలీప్యాడ్ వద్ద  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.
 
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అరసవిల్లిలోని సూర్యభగవానుడి ఆలయంలో అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభం అయ్యాయి. విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారికి మహా క్షీరాభిషేకం నిర్వహించారు.
 
స్వామివారి దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలలో వేచి ఉన్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె. నివాస్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్, వైసీపీ నేతలు మామిడి శ్రీకాంత్, దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణి దంపతులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ ఉల్లంఘన కేసులన్నీ ఎత్తివేత : తమిళనాడు సీఎం ప్రకటన