పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళలో అంతుచిక్కని వ్యాధి అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలపై హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్లారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్ కూడా వెళ్లినవారిలో వున్నారు.
పూళ్ళలో అంతుచిక్కని వ్యాధికి సంబంధించి శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సియం ఆయా అధికారులతో సమీక్షించారు. వెంటనే వెళ్ళి పరిస్థితిని పరిశీలించాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్‌ను సియం ఆదేశించడంతో సిఎస్ ఇతర అధికారులు హుటాహుటిన ఏలూరు బయలుదేరి వెళ్ళారు.
ఈ అంశానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం పూర్తి అప్రమత్తం చేయడంతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమీషనర్లు ఏలూరు పూళ్ళ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు.