Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్-5‌లో సింగర్ సునీత ఎంట్రీ...

Advertiesment
బిగ్‌బాస్-5‌లో సింగర్ సునీత ఎంట్రీ...
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (22:20 IST)
బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ కోసం రంగం సిద్ధమవుతున్నాయి. బిగ్‌బాస్ నాలుగో సీజన్ ముగిసిన మూడు నెలలు కూడా కాకుండానే ఐదో సీజన్ గురించి చర్చ సాగుతోంది. కరోనా కారణంగా గతేడాది లేటుగా ప్రారంభమైంది. ఈ సీజన్ డిసెంబర్‌లో పూర్తయింది. ప్రస్తుతం ఐదో సీజన్‌కు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట కూడా షురూ అయిపోయింది. 
 
ఈ క్రమంలోనే కొందర్ని ఫైనల్ చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఆఫర్ ఇచ్చి సీజన్-5 కోసం లాక్ చేసారని తెలుస్తుంది. ఈయనతో పాటు టిక్ టాక్ దుర్గా రావు కూడా సీజన్-5 కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిపోయాడు. కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశాడు దుర్గారావు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరంటే..? సింగర్ సునీత. 
 
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దానికి కారణం రెండో పెళ్లి. రామ్ వీరపనేనితో ఈమె ఏడడుగులు నడిచింది. జనవరిలో ఈమె పెళ్లి జరిగింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు వార్తల్లోనే ఉంటూ వస్తుంది సునీత. 
 
ఇప్పుడు బిగ్ బాస్-5 తెలుగు కోసం ఈమెను నిర్వాహకులు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది కూడా లేదు. ఎందుకంటే తొలి సీజన్ నుంచి కూడా ఈ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు నిర్వాహకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో కూడా ‘దృశ్యం 2’కు స‌న్నాహాలు