Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీష్మ ఏకాదశి.. ఆరుద్ర నక్షత్రం, ఏకాదశి: శ్రీకృష్ణ పూజ చేస్తే..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (04:00 IST)
ఫిబ్రవరి 23, మంగళవారం, మాఘమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం కలిసివచ్చే శుభదినం. ఈ రోజును జయ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీకృష్ణుడి పరమాత్మలో లీనమై తరించాడు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో, ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. 
 
ఈ రోజున భీష్ముల వారిని స్తుతించడం.. శ్రీ మహావిష్ణువును పూజించడం చేస్తే స్వర్గ ప్రాప్తి ఖాయమని.. ఏకాదశి వ్రతం ఆచరించడం సమస్త దోషాలను తొలగిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా అది కచ్చితందా విజయవంతం అవుతుంది. 
 
ఇంద్రుడు ఇదే రోజున రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళి.. పరమాత్ముని కృపతో విజయం సాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇలా మహానుభావులే భీష్మ ఏకాదశి రోజున చేపట్టిన కార్యాల్లో దిగ్విజయం సాధించిన దాఖలాలు వున్నాయి. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం రావడంతో శివకేశవుల పూజకు కూడా ఉత్తమం. అందుకే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఏకాదశి వ్రతం ఆచరించడం.. మహాశివునికి అభిషేకాలు చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments